హైదరాబాద్, 8 జూలై (హి.స.)
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన రావు లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని వీరిద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసులను క్వాష్ చేయాలని వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వారి పిటిషన్లను హైకోర్టు విచారణకు అనుమతించింది.
కాగా, కరోనా వ్యాప్తి సమయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు 40 కార్లు, 60 బైక్లతో ర్యాలీ నిర్వహించారంటూ ఈటలపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా దుబ్బాకలో గాంధీ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించడంపై దుబ్బాక పోలీసులు రఘునందన్పై కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్