అమరావతి, 8 జూలై (హి.స.):రోజులాగానే ఆనందంగా విద్యార్థులుస్కూల్‌కుబయలుదేరారు. కానీ అంతలోనే ఊహించని ఘటనతో విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. వారు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ లారీ మృత్యువు రూపంలో కబలించింది. ఈ ప్రమాదం కృష్ణా జిల్లాలోని( పామర్రు మండలంలో జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ (15) మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ