సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కారులో చెలరేగిన మంటలు
మహబూబాబాద్, 8 జూలై (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ నియోజవర్గ పర్యటనలో భాగంగా సొమ్లాతండాలో హెలిప్యాడ్ వ
వేం నరేందర్ రెడ్డి


మహబూబాబాద్, 8 జూలై (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ నియోజవర్గ పర్యటనలో భాగంగా సొమ్లాతండాలో హెలిప్యాడ్ వద్దకు ఇన్నోవా క్రిస్టా కారులో వేం నరేందర్ రెడ్డి వెళ్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. సకాలంలో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande