మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..
ముంబై, 8 జూలై (హి.స.)భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. గత వారం రోజులుగా లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 98 వేలకు దిగువన చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో జులై 8న ఉదయం 6 గంట
Gold


ముంబై, 8 జూలై (హి.స.)భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. గత వారం రోజులుగా లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 98 వేలకు దిగువన చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో జులై 8న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 98, 280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.90,090కి చేరింది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. వివిధ పండగలు, శుభకార్యలయాల సమయంలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే తులంపై దాదాపు 400 వరకు తగ్గుముఖం పట్టింది. వెండి ధర కిలోకు లక్షా 9,900 వద్ద ఉంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం.

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,430, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,240 ఉంది.

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande