న్యూఢిల్లీ, 8 జూలై (హి.స.) కేంద్రమంత్రి అశ్విని వైష్ణవకు
పితృవియోగం సంభవించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అశ్వినీ వైష్ణవ్ తండ్రి దౌలాల్ వైష్ణవ్ జోద్పూర్ ఎయిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11.52 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 82 ఏళ్ల దౌలాల్ వైష్ణవ్ కొన్ని రోజుల క్రితం జోధ్పూర్ ఎయిమ్స్ చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఈ మేరకు జోధ్పూర్ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తండ్రి మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. మా మెడికల్ టీమ్ శాయశక్తులా కృషి చేసినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయింది' అని ఎయిమ్స్ తన ప్రకటనలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..