మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు కలకలం
ముంబయి:, 8 జూలై (హి.స.) మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా తీరప్రాంతంలో ఓ విదేశీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్‌దండాలోని కొర్లాయ్‌ తీరానికి రెండు నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ పడవను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారమ
మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు కలకలం


ముంబయి:, 8 జూలై (హి.స.) మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా తీరప్రాంతంలో ఓ విదేశీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్‌దండాలోని కొర్లాయ్‌ తీరానికి రెండు నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ పడవను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారమందుకున్న రాయ్‌గఢ్‌ పోలీసులు బాంబు నిర్వీర్య బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఈ పడవ ఏ దేశానికి చెందింది? ఏ మార్గంలో వచ్చిందన్న కోణాల్లో నౌకాదళం, తీరగస్తీ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఆ పడవపై వేరే దేశానికి చెందిన గుర్తులున్నట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఇది పాకిస్థాన్‌కి చెందిన పడవగా అనుమానిస్తున్నారు. అది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో తీర ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande