బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఎన్‌కౌంటర్
పాట్నా -, 8 జూలై (హి.స.)బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అలియాస్ రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు. సంఘటనా
uttarakhand police


పాట్నా -, 8 జూలై (హి.స.)బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అలియాస్ రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు. సంఘటనాస్థలి నుంచి తుపాకీ, బుల్లెట్, కార్ట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీకి తరలించినట్లు బీహార్ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఖేమ్కా హత్యకు సంబంధించి పాట్నా పోలీసులు డజనుకు పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక ఖేమ్కా అంత్యక్రియలకు పాట్నాలోని పున్‌పున్ నివాసి రోషన్ కుమార్ హాజరయ్యాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య మిస్టరీ వీడించింది. అయితే ఈ హత్యలో రాజా ప్రధాన సూత్రధారిగా అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు రాజాను ఎన్‌కౌంటర్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande