ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో కాంగ్రెస్‌కు బ్రిటన్‌ సాయం
దిల్లీ 8 జూలై (హి.స.)ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బ్రిటన్‌ సాయం చేసిందని భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబె ఆరోపించారు. సిక్కు జాతికి ఆ పార్టీ అనేకసార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలని
ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో కాంగ్రెస్‌కు బ్రిటన్‌ సాయం


దిల్లీ 8 జూలై (హి.స.)ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బ్రిటన్‌ సాయం చేసిందని భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబె ఆరోపించారు. సిక్కు జాతికి ఆ పార్టీ అనేకసార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలని సోమవారం ఎక్స్‌లో స్పష్టం చేశారు. ‘

1947లో కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను పాకిస్థాన్‌కు అప్పగించారు. ఆ సమయంలో యావత్‌ సిక్కు జాతి ఆందోళనలు చేపట్టింది. 1984లో సిక్కు వేర్పాటువాదం పెరిగినప్పుడు బింద్రన్‌వాలేను రంగంలోకి దింపారు. జైల్‌సింగ్‌ను రాష్ట్రపతిని చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌ సైన్యం సాయంతో స్వర్ణ దేవాలయంపై దాడి చేశారు. ఇందిరా గాంధీ హత్యతో సిక్కు అల్లర్లు చెలరేగాయి. అనేక మంది సిక్కులను దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు హత్య చేయించారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేయగానే మరో సిక్కు మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాన మంత్రిని చేశారు. ఇలా అనేకసార్లు సిక్కులను కాంగ్రెస్‌ వాడుకుంది’ అని దుబే ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande