సీఏ ఫైనల్ ఇంటర్ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు
అమరావతి, 8 జూలై (హి.స.) ): జాతీయస్థాయిలో ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఏ ఫైనల్‌, ఇంటర్‌, ఫౌండేషన్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుప
సీఏ ఫైనల్ ఇంటర్ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు


అమరావతి, 8 జూలై (హి.స.)

):

జాతీయస్థాయిలో ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఏ ఫైనల్‌, ఇంటర్‌, ఫౌండేషన్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ వెల్లడించారు. సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని మెయిన్‌ క్యాంప్‌సలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ విద్యార్థులు కొండ్ల సాయిరామరెడ్డి 23వ ర్యాంకు, కురువ మోహన్‌ 26, ఎస్‌.నిఖిల్‌ జైన్‌ 33, బి.నాగిరెడ్డి 41, పి.పూజిత 43వ ర్యాంకు కైవసం చేసుకున్నారని తెలిపారు. అదే విధంగా సీఏ ఇంటర్లో డి.నాగ సాయి లక్ష్మణ్‌ 15వ ర్యాంకు, జె.శరత్‌ చంద్ర 29 ర్యాంకులు సాధించారు. ఇంకా సీఏ ఫౌండేషన్‌లో గుంటూరు పూజిత 16, గుండాల సాయి పద్మ, పెనుగొండ సాయి రాఘవేంద్ర రెడ్డి 17వ ర్యాంకులు సాధించారని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande