అసెంబ్లీలో చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధం – బీఆర్ఎస్ నేత‌లవ‌న్నీ డ్రామాలు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
హైదరాబాద్, 8 జూలై (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ స్వీక‌రించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు చేరుకున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌ట
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్


హైదరాబాద్, 8 జూలై (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ స్వీక‌రించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు చేరుకున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంద‌న్నారు. ఇది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని, అసెంబ్లీలోనే చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నేతలకు అంత ఆసక్తి ఉంటే.. స్పీకర్ కు లేఖ రాయాలని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామని, ప్రతి చర్చ ప్రజలకు తెలియాలని, ఆన్ రికార్డులో ఉన్న విషాయలు భవిష్యత్ తరాలకు తెలుస్తాయని.. చర్చల అనంతరం ప్రజలే అన్ని తేలుస్తారని మంత్రి పొన్నం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande