అమరావతి,
అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటే తేజస్విని, శ్రీ వెంకట్, వారి ఇద్దరు పిల్లలు విహారయాత్ర కోసం అని డల్లాస్‌కు వెళ్లారు. అట్లాంటాలోని బంధువుల ఇంటిని సందర్శించి తిరిగి వస్తుండగా డల్లాస్‌లో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు-కారును ఢీకొట్టింది. వెంటనే మంటలు అంటుకుని నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా కన్నీరుమున్నీరు అయ్యారు. అంత్యక్రియల కోసం మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తేజస్విని, శ్రీ వెంకట్‌కు 2013లో వివాహం జరిగింది. ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. విహార యాత్ర కోసం అని అమెరికాకు వెళ్లారు. బంధువులతో సరాదాగా గడిపారు. తిరిగి వచ్చే క్రమంలో ఒక ట్రక్కు.. కారును ఢొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగడంతో కాలి బూడిదైపోయారు. డీఎన్‌ఏ టెస్ట్‌ల తర్వాత అధికారులు మృతదేహాలను అప్పగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ