విజయవాడ, 8 జూలై (హి.స.)
:విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు( )ఇవాళ(మంగళవారం) ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు(జులై 8) నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. మూడు రోజుల పాటుశాకంబరీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు మూడు రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ