29.510 కేజీల. దుర్గమ్మ బంగారాన్ని ఎస్ బీ ఐ.గాంధీనగర్. బ్యాంక్ లో డిపాజిట్ చేశారు
అమరావతి, 8 జూలై (హి.స.) శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గాంధీనగర్‌ బ్రాంచ్‌లో సోమవారం డిపాజిట్‌ చేశారు. డిపాజిట్‌పై సంవత్సరానికి 0.60 శాతం వడ్డీ లభిస్తుందని ఈవో శీనానాయక్‌ తె
29.510 కేజీల. దుర్గమ్మ బంగారాన్ని ఎస్ బీ ఐ.గాంధీనగర్. బ్యాంక్ లో డిపాజిట్ చేశారు


అమరావతి, 8 జూలై (హి.స.)

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గాంధీనగర్‌ బ్రాంచ్‌లో సోమవారం డిపాజిట్‌ చేశారు. డిపాజిట్‌పై సంవత్సరానికి 0.60 శాతం వడ్డీ లభిస్తుందని ఈవో శీనానాయక్‌ తెలిపారు. డిపాజిట్‌ చేసిన బంగారం విలువ రూ.26.58 కోట్లు ఉంటుందన్నారు. నగల నిర్ధారణ అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, దుర్గ గుడి ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు తదితరుల సమక్షంలో బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande