తెలంగాణ, కరీంనగర్. 8 జూలై (హి.స.)
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో జూలై 13వ తేదీ ఆదివారం నాడు నిర్వహించనున్న బోనాల వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఆలయ నిర్మాణ కమిటీ మంగళవారం ఆహ్వానించింది. ఈ సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ను శాలువాతో సత్కరించి, బోనాల వేడుకలకు హాజరయ్యేలా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, సునీల్ రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, ప్రవీణ్, గోపాల్ రెడ్డి, నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు