రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు
తెలంగాణ, ఖమ్మం. 8 జూలై (హి.స.) రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. మంగళవారం ఏన్కూరు రైతు వేదిక నందు, రైతులకు మినుములు, కందులు, పెసర, వరి, క్వాలిటీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ
వైరా ఎమ్మెల్యే


తెలంగాణ, ఖమ్మం. 8 జూలై (హి.స.)

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్

ప్రభుత్వం పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. మంగళవారం ఏన్కూరు రైతు వేదిక నందు, రైతులకు మినుములు, కందులు, పెసర, వరి, క్వాలిటీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొమ్మిది రోజులు వ్యవధిలో రైతు బందు పేరుతో 14 కోట్ల 85 లక్షల రూపాయలు ఏనుకూరు మండలంలో రైతులకు జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు అమ్మిన పంటకు బోనస్ ఇచ్చి రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇవ్వడం జరుగుతుందని, పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande