ఆంధ్ర ప్రదేశ్.రాష్ట్రానికి.మోదీ.ప్రభుత్వం.మరి తీపి.కబురు
అమరావతి, 8 జూలై (హి.స.) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌పై కేంద్ర ప్రభుత్వం) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కాలేజ్‌కి శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోద
ఆంధ్ర ప్రదేశ్.రాష్ట్రానికి.మోదీ.ప్రభుత్వం.మరి తీపి.కబురు


అమరావతి, 8 జూలై (హి.స.)

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌పై కేంద్ర ప్రభుత్వం) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కాలేజ్‌కి శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కాలేజ్‌లో చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సదుపాయం కూడా కల్పించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను మరో కాలేజ్‌కి తరలించి వెసులుబాటు కల్పించేందుకు కేంద్రమంత్రి లలన్ సింగ్ అంగీకరించారు. గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో గరివిడి కాలేజ్‌కి అనుమతులని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande