కర్నూలు, 8 జూలై (హి.స.)సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అందులో టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ట్యూనా చేపలు వేడి రక్తాన్ని కలిగి ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా నియంత్రించగలవు. భూమిపై ఎల్లోఫిన్, అల్బాకోర్, బ్లూఫిన్, బిజీఐ, ఇలా మొత్తం 15 రకాల ట్యూనా చేపలు ఉన్నాయి. ట్యూనా చేపలు ఎక్కువగా మధ్యధరా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలలో ఉంటాయి. ఇక్కడ 40 కంటే ఎక్కువ జాతుల టూనా చేపలు కనిపిస్తాయి. అట్లాంటిక్ బ్లూఫిన్ పది అడుగుల పొడవు, 2,000 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది గంటకు 43 మైళ్ల వేగంతో ఈదుతుంది.
ట్యూనా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. టూనా చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది మెదడు, కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. టూనా చేప ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. బరువును నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్న వారు టూనా చేపలు తరచూ తినాలని నిపుణులు చెబుతున్నారు. సోడియం స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ టూనా చేప ముక్కను తినమంటున్నారు.
టూనా చేప తినటం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండిని ఫీలింగ్ ఇస్తుంది. టూనా చేపలు మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అధికంగా తింటే మాత్రం చెడు ప్రభావాలు తప్పవు అంటున్నారు నిపుణులు. టూనా చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో విష పదర్ధాలు పెరుగుతాయి. కాబట్టి టూనాను మితంగానే తినాలి. కానీ టూనా చేపలను అధికంగా పట్టడం వల్ల అవి ఇప్పుడు దాదాపు అంతరించిపోయాయి, కాబట్టి అవి అంతరించిపోకుండా కాపాడటానికి ప్రతి సంవత్సరం మే 2 న ‘ప్రపంచ టూనా దినోత్సవం’ జరుపుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి