తిరుమల, 8 జూలై (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి ఎన్‌జీ షెడ్స్ వరకు వేచి ఉన్నారు. నిన్న(సోమవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 80,081 మంది భక్తులు దర్శించుకున్నారు.
28,775 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారిని హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.48 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి