డిజిటల్‌గా జనాభా లెక్కలు.. ప్రజలు స్వయంగా నమోదు చేసుకునే ఛాన్స్!
ఢిల్లీ, 8 జూలై (హి.స.)ఈసారి జనాభా లెక్కల డేటా చాలా త్వరగానే విడుదల చేస్తామని రిజిస్ట్రార్ జనరల్ ఆఫీసు, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చెప్పారు. ఈసారి జనాభా లెక్కల ప్రక్రియను మొట్టమొదటిసారి డిజిటల్‌గా చేపట్టనున్నామని, రెండు దశల్లో ఈ ప్రక్రియ సాగుతుందని ‘స
డిజిటల్‌గా జనాభా లెక్కలు.. ప్రజలు స్వయంగా నమోదు చేసుకునే ఛాన్స్!


ఢిల్లీ, 8 జూలై (హి.స.)ఈసారి జనాభా లెక్కల డేటా చాలా త్వరగానే విడుదల చేస్తామని రిజిస్ట్రార్ జనరల్ ఆఫీసు, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చెప్పారు. ఈసారి జనాభా లెక్కల ప్రక్రియను మొట్టమొదటిసారి డిజిటల్‌గా చేపట్టనున్నామని, రెండు దశల్లో ఈ ప్రక్రియ సాగుతుందని ‘సెన్సన్ ఇండియా 2027’ అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా అధికారులు ప్రకటించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సన్ మొదలవుతుందని, జనాభా లెక్కలు ఫిబ్రవరి 2027న జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు తమకు తామే జనాభా లెక్కల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని, కావాలనుకున్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. అలాగే ఈసారి జనాభా లెక్కల డేటాను ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాషల్లో మొబైల్స్ యాప్స్‌ ద్వారా సేకరిస్తారని, అధికారులు కూడా సొంత ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్స్‌లో డేటా కలెక్ట్ చేస్తారని పేర్కొంది.

జనాభా లెక్కల ప్రక్రియను ఆధునికీకరించడంలో ఇది తొలి అడుగని, ఈ డేటాను ఎలక్ట్రానికల్‌గా సెంట్రల్ సర్వర్‌కు పంపుతామని, కావున జనాభా లెక్కలు కూడా గతంతో పోలిస్తే వేగంగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెప్పింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande