అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్ధులు అస్వస్థత
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) బుక్కరాయ సముద్రం: అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయి. దేశంలోన
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్ధులు అస్వస్థత


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

బుక్కరాయ సముద్రం: అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులకు వర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుని వసతి గృహాల్లో ఉంటున్నారు.

అయితే ఇక్కడి వాతావరణం విద్యార్థులకు పడకపోవడంతో గత మూడు రోజులుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని వర్సిటీ యాజమాన్యం అనంతపురం తీసుకెళ్లి ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న విద్యార్థులను ప్రత్యేక గదుల్లో ఉంచి వారికి ప్రభుత్వ వైద్య సిబ్బందితో రక్త పరీక్షలు చేయించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక వారి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుందని డాక్టర్‌ తెహర్నిశ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande