‘భగవంతుని ఆశీస్సులతో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
తిరుమల , 4 ఆగస్టు (హి.స.)కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పార్థసారథి స్వామి
‘భగవంతుని ఆశీస్సులతో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు


తిరుమల , 4 ఆగస్టు (హి.స.)కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పార్థసారథి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

మొదటగా టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన మంత్రి పార్థసారథి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు, వ్యవసాయ పాడిపంటలు బాగుండాలని భగవంతున్ని ప్రార్థించానని అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు 2047 విజన్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తపిస్తున్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande