అనకాపల్లి.జిల్లా.పరవాడ ఫార్మా సిటీలో లూపిన్ ఫార్మా.కంపెనీ లో. విషవాయువులు లీకయ్యాయి
అమరావతి, 4 ఆగస్టు (హి.స.) పరవాడ: అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో లూపిన్‌ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకయ్యాయి. ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. లూపిన్‌ కంపెనీలో సాయికుమార్, శివ నాయుడు, గణేష్,
అనకాపల్లి.జిల్లా.పరవాడ ఫార్మా సిటీలో లూపిన్ ఫార్మా.కంపెనీ లో. విషవాయువులు లీకయ్యాయి


అమరావతి, 4 ఆగస్టు (హి.స.)

పరవాడ: అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో లూపిన్‌ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకయ్యాయి. ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. లూపిన్‌ కంపెనీలో సాయికుమార్, శివ నాయుడు, గణేష్, రాజశేఖర్ కుమార్, నరేష్ కుమార్, రామ నాయుడు కార్మికులుగా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రియాక్టర్ వద్ద రసాయన వాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చడంతో ఆరుగురూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కంపెనీ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఇంఛార్జ్‌ డీఎస్పీ మోహన్ రావు, ఇంచార్జ్ సీఐ రామచంద్రరావు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫ్యాక్టరీస్ పరమేశ్వర పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande