తిరుమల, 4 ఆగస్టు (హి.స.)
: తిరుమలలో మహిళా భక్తులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి ఆలయ వెండివాకిలి, పీఎసీ-3 వద్ద పలువురు మహిళా భక్తుల నుంచి మంగళ సూత్రాoలు కాజేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. రెండు కేసుల్లో మహారాష్ట్రకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 87 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ