తిరుమల, 4 ఆగస్టు (హి.స.)
:టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి()స్పందించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూడంచెల భద్రతలో భాగంగా శ్రీవారి ఆలయం, భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందని ఉద్ఘాటించారుభానుప్రకాష్ రెడ్డి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ