TDPలోకి మళ్లీ వస్తా.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
అమరావతి, 4 ఆగస్టు (హి.స.)ఏపీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్... కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి రాజకీయాల్లోకి రావడం పై... గల్లా జయదేవ్ స్పందించారు. పైన ఉన్న దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తానని... మరోసారి రాజ్య
TDPలోకి మళ్లీ వస్తా.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు


అమరావతి, 4 ఆగస్టు (హి.స.)ఏపీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్... కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి రాజకీయాల్లోకి రావడం పై... గల్లా జయదేవ్ స్పందించారు. పైన ఉన్న దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తానని... మరోసారి రాజ్యసభకు కూడా వెళ్తానని చెప్పుకొచ్చారు గల్లా జయదేవ్.

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక స్వామిని ఇవాళ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ ప్రత్యేక పూజలు కూడా చేశారు.అనంతరం... తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అంశంపై.. టిడిపిలోకి రీ ఎంట్రీ ఇవ్వడం పై కూడా క్లారిటీ ఇచ్చారు. టిడిపి లోకి రావడం కోసం అది నాయకత్వంతో మాట్లాడుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు గల్లా జయదేవ్. ఇది ఇలా ఉండగా వ్యాపారులకు సమయం కేటాయించేందుకు రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు గత సంవత్సరం గల్లా జయదేవ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande