అమరావతి, 4 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ఈరోజు(సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.
లక వ్యాఖ్యలు తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామానికి చెందిన వారు. ఈయన 1994 మార్చి 9న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పని చేశారు. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలు అందించారు. 2010-14 మధ్య జీఎంసీ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016-17లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి