600 కోట్ల.నిధులతో.కంకిపాడు నుంచి గుడివాడ మధ్యలో 27 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరసల గ్రీన్.ఫీల్డ్ జాతీయ రహదారి
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) కంకిపాడు నుంచి గుడివాడ మధ్యలో 27 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద రూ.600 కోట్ల నిధులను ఈ రహదారి కోసం మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి నితిన
600 కోట్ల.నిధులతో.కంకిపాడు నుంచి గుడివాడ మధ్యలో 27 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరసల గ్రీన్.ఫీల్డ్ జాతీయ రహదారి


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

కంకిపాడు నుంచి గుడివాడ మధ్యలో 27 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద రూ.600 కోట్ల నిధులను ఈ రహదారి కోసం మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకారం తెలిపారు. విజయవాడ నుంచి గుడివాడకు చేరుకునేందుకు అత్యంత కీలకమైన ఈ రహదారి ప్రాధాన్యం గురించి బందరు ఎంపీ బాలశౌరి.. ప్రత్యేక నివేదికను రూపొందించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి గురువారం వివరించారు.’

‘మచిలీపట్నం పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారి వరకు ప్రతిపాదించిన 18.5 కిలోమీటర్ల ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు రూ.350 కోట్లను మంజూరు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి వెంటనే స్పందించి.. సంబంధిత అధికారులను పిలిచి.. ఈ రహదారుల నివేదికలను రాష్ట్రం నుంచి తెప్పించి.. నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.’

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande