తెలంగాణలో ఏసీబీ దూకుడు.. జూలైలో 22 కేసులు నమోదు
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులపై మెరుపుదాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క జూలై నెలలోనే మొత్తం 22 కేసులు నమోదు చేశారు. అందులో 13 ట్రాప్ కేసులు, 1 అసమాన సంపత్తి, 1 క్రిమినల్ మిస్
ఏసీబీ దూకుడు


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులపై మెరుపుదాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క జూలై నెలలోనే మొత్తం 22 కేసులు నమోదు చేశారు. అందులో 13 ట్రాప్ కేసులు, 1 అసమాన సంపత్తి, 1 క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదయ్యాయి. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అసమాన ఆస్తుల కేసులో రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అకౌంటింగ్ లేని రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో జనవరి నుండి జూలై వరకు 148 కేసులు నమోదు చేశారు. మొత్తం 145 మంది ప్రభుత్వ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ట్రాప్ కేసుల్లో మొత్తం రూ.30.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జూలైలో 21 కేసులకు నివేదికలు పంపారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande