దుర్గం చెరువులో దూకి వ్యాపారి ఆత్మహత్య
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన దుర్గం చెరువు ఆత్మహత్యలకు ఆలవాలంగా మారుతుంది. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా అందులో ఒకరిని పోలీసులు రక్షించారు. తాజాగా మరో వ్యాపారి దుర్గం చెరువులో
దుర్గం చెరువు


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన

దుర్గం చెరువు ఆత్మహత్యలకు ఆలవాలంగా మారుతుంది. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా అందులో ఒకరిని పోలీసులు రక్షించారు. తాజాగా మరో వ్యాపారి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ తిరుమలగిరి కి చెందిన వ్యాపారవేత్త చంద్రేష్ జైన్(34) వ్యాపారంలో నష్టపోయి గత కొద్దిరోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే ఈమద్య కాలంలో చంద్రేష్ జైన్ తండ్రి మరణించడంతో మానసికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు.

దీంతో చంద్రేష్ జైన్ గురువారం దుర్గం చెరువు వద్దకు వచ్చిన ఆయన చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కనబడకుండా పోవడం తో జైన్ కుటుంబ సభ్యులు గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే జైన్ మృతదేహం శుక్రవారం ఉదయం దుర్గం చెరువులో తేలుతూ కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande