తెలంగాణ, మిర్యాలగూడ. 1 ఆగస్టు (హి.స.) విద్యుత్కు సంబంధించిన
అన్ని యూనిట్ల పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే జనవరి 26 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శుక్రవారం నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం యూనిట్- 1 ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్లాంట్ నిర్మాణం పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అధిక భారం పడుతున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవడంతోపాటు పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు