న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.)
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఈసీ స్పందించింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. బాధ్యతా రహితమైన, నిరాధారమైన ప్రకటలను పట్టించుకోవద్దని.. పారదర్శకంగా తమ విధులను కొనసాగించాలని ఈసీ అధికారులను కోరింది. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు ప్రతిరోజూ వస్తున్నాయని.. వాటికి బలమైన ఆధారాలు లేవని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆయా ఆరోపణల ప్రభావం పడకుండా నిజాయితీగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. పారదర్శకంగా, విశ్వసనీయ ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చౌర్యం జరుగుతుందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్