ఏ ఫర్ అఖిలేష్.. డీ ఫర్ డింపుల్ అంటూ స్కూల్లో పాఠాలు.. సమాజ్‌వాదీ నేతలపై కేసులు..
లక్నూ, 4 ఆగస్టు (హి.స.) పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా రాజకీయ పాఠాలు నేర్పుతున్న విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లో నెలకొంది. అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్‌కు బదులుగా.. ఏ ఫర్ అఖిలేష్ (A for Akhilesh), డీ ఫర్ డింపుల్ (D for Dim
ఏ ఫర్ అఖిలేష్.. డీ ఫర్ డింపుల్ అంటూ స్కూల్లో పాఠాలు.. సమాజ్‌వాదీ నేతలపై కేసులు..


లక్నూ, 4 ఆగస్టు (హి.స.)

పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా రాజకీయ పాఠాలు నేర్పుతున్న విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లో నెలకొంది. అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్‌కు బదులుగా.. ఏ ఫర్ అఖిలేష్ (A for Akhilesh), డీ ఫర్ డింపుల్ (D for Dimple), ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్నారు. యూపీలోని పీడీఏ పాఠశాలల్లో సమాజ్‌వాద్ పార్టీ నేతలు ఈ తరహా పొలిటికల్ పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ పరిసర ప్రాంతాల్లో పిల్లలు తక్కువగా ఉన్నారనే కారణంతో యోగి ప్రభుత్వం కొన్ని పాఠశాలలను మూసేసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష సమాజ్‌వాద్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో పీడీఏ పాఠశాల (PDA Pathshala)లను ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెబుతున్నారు. అయితే తమ పిల్లలకు స్థానిక ఎస్పీ నేత ఫర్హాద్ ఆలం గడా (Farhad Alam Gada) పొలిటికల్ పాఠాలు చెబుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫర్హాద్ పాఠశాలలోని పిల్లలకు ఏ ఫర్ అఖిలేష్, డీ ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande