ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం..
హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.) లండన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ రెండు టెస్టులు, ఇండియా రెండు
ఇండియా విన్


హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)

లండన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ రెండు టెస్టులు, ఇండియా రెండు టెస్టుల్లో విజయం సాధించాయి. ఒక టెస్టు డ్రా ముగిసింది. దీంతో 2-2తో సిరీస్ సమం అయింది. ఐదో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (118), ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53), ద్రువ్ జురేల్ (34) బ్యాటింగ్లో రాణించారు. ఇక బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీశారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande