ముంబయి:4 ఆగస్టు (హి.స.) దేశీయ మార్కెట్లు (Stock Market Today) ఈ వారాన్ని లాభాల్లో మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు, ట్రంప్ టారిఫ్‌లు వంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు ప్రస్తుతం సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 286 పాయింట్ల లాభంతో 80,886 వద్ద ఉంది. నిఫ్టీ (Nifty) 96 పాయింట్లు ఎగబాకి, 24,661 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.24గా ఉంది.
నిఫ్టీ సూచీలో భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ