డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగకు తాకిన క్రమంలో ఐదుగురు భక్తులు మృతి
బిహార్‌: భాగల్పూర్ :4 ఆగస్టు (హి.స.) జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు శివ భక్తులు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రావణి మేళా చివరి సోమవారం సందర్భంగా సుల్తాన్‌గంజ్ నుంచి గంగాజలం తీసుకుని జయేష్ఠగౌర్ నాథ్‌స్థాన
Accident


బిహార్‌: భాగల్పూర్ :4 ఆగస్టు (హి.స.)

జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు శివ భక్తులు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రావణి మేళా చివరి సోమవారం సందర్భంగా సుల్తాన్‌గంజ్ నుంచి గంగాజలం తీసుకుని జయేష్ఠగౌర్ నాథ్‌స్థాన్‌కు వెళ్తున్న యువకుల బృందం ఈ ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై అమర్చిన డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగను తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది.

పోలీసుల వివరణ ప్రకారం రాత్రి 12:05 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. డీజే సౌండ్ సిస్టమ్‌తో ఉన్న వాహనం ఒక ప్రదేశంలో బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ వాహనాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, డీజే సిస్టమ్ రోడ్డుపైన హై-టెన్షన్ విద్యుత్ తీగకు అనుకోకుండా తగిలింది. ఆ క్రమంలో షాక్ కొట్టి వాహనం పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. వాహనంలో మొత్తం తొమ్మిది మంది ఉండగా, డజన్ల కొద్దీ భక్తులు కాలినడకన డీజే సౌండ్ సిస్టమ్‌తో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande