అమరావతి, 1 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. ఇవాళ ఆయన విశాఖ (Vishakha)లో మీడియాతో మాట్లాడుతూ.. నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని తెలిసి పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్పా.. అని ప్రశ్నించారు. ఆయనను నెల్లూరు (Nellore) వెళ్లనివ్వకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగునా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధాలు లేకుండానే మాజీ మంత్రిని జైలులో పెట్టడం సబబేనా అని ఫైర్ అయ్యారు. అసలు పోలీసులు అంటేనే జనానికి భయం లేకుండా పోయిందని, ఒకవేళ భయం అనేది ఉంటే నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. టీడీపీ (TDP) మూకలు చేయాల్సింది అంతా చేసి తిరిగి ప్రధాన ప్రతిపక్షం మీద బుదరజల్లేందుకు ప్రయత్నిస్తోందని కామెంట్ చేశారు. తాము అధికారంలో ఉన్న నాడు అమ్మఒడి రెండు విడతలుగా ఇవ్వలేదని.. కానీ, కూటమి సర్కార్ రెండు, మూడు విడతలుగా ఇస్తోందని కామెంట్ చేశారు. సూపర్ సిక్స్ (Super Six) పథకాలను అటకెక్కించారని.. రాష్ట్రం అప్పులపాలు అవుతోందిన బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి