మహబూబాబాద్, 1 ఆగస్టు (హి.స.)
సుప్రీంకోర్టు తీర్పుతో మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికల సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండలంలోని మన్నెగూడెం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..
కోర్టు తీర్పుతో అంతిమంగా సత్యం ధర్మం గెలిచింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గిరిజనులకు స్వర్ణ యుగం అని, అనేక ఏళ్లుగా ఎదురుచూసిన తాండలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటుచేసి, 6 శాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచుకున్నామన్నారు.
డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగానుఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా అంతిమ కార్యక్రమం ఈ గడ్డమీదనే పూర్తి చేసుకున్నాను.మంత్రిగా ఇక్కడ నుండే పరిపాలన సాగించాను, జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాను, అలాంటి నాకు డోర్నకల్ రావడానికి ఎవరి దయాదాక్షిణ్యాలు, పర్మిషన్ కానీ అవసరం లేదని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..