దేశ ఇంధన ప్రయోజనాలే ముఖ్యం ...రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నాము
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) భారత విదేశాంగశాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్‌కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాత
US


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

భారత విదేశాంగశాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్‌కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు.

పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్‌, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని రణధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

అమెరికాతో భారత్‌ రక్షణ సంబంధాలపై స్పందిస్తూ.. ఇరు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande