అమరావతి, 1 ఆగస్టు (హి.స.)
మసీదు సెంటర్ (కాకినాడ): జాతీయస్థాయి క్రీడలకు కాకినాడ మరోసారి వేదికైంది. హాకీ జూనియర్ మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్-2025 శుక్రవారం ప్రారంభం కానుంది. 12 రోజులపాటు జరిగే సమరానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 30 జట్లు సిద్ధమయ్యాయి. టోర్నీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారిణులకు జాతీయస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, 2026-27లో జరిగే మహిళా హాకీ వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారతజట్టుకు ఎంపిక చేస్తారని హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎం.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో గురువారం హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి.చాణక్యరాజు, కార్యదర్శి జి.హర్షవర్ధన్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ జూనియర్ మహిళా ఛాంపియన్‌షిప్ నిర్వహణకు శాప్, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. డీఎస్‌డీవో శ్రీనివాసకుమార్, హాకీ సీనియర్ కోచ్ వి.రవిరాజు, ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి టోర్నమెంట్‌ను విజయవంతం చేయవంతం చేస్తామని పేర్కొన్నారు. మ్యాచ్‌లను తిలకించేందుకు హాకీ ఇండియా సెలెక్టర్లు వచ్చారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ