'శ్రావణ మాసంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాం'.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) తెలంగాణాలో అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ మరియు సన్న బియ్యం పంపిణీ తో ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెలువెత్తుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లీ ప్యాలెస్లో
మంత్రి పొన్నం


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

తెలంగాణాలో అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ మరియు సన్న బియ్యం పంపిణీ తో ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెలువెత్తుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లీ ప్యాలెస్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు మంత్రి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయి రేషన్ కార్డులు పొందలేని పరిస్థితి ఉండేదని, అంతేకాకుండా కొత్తగా ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా రేషన్ కార్డులు పేర్లు ఎక్కించలేని పరిస్థితులతో ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారని అన్నారు. కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు అందజేయడమే కాకుండా అర్హులందరి పేర్లు కార్డులో నమోదు చేసుకొని అందజేస్తున్నామని తెలిపారు. ఆషాఢ మాస బోనాలు పండగ జరిగిందని ఇప్పుడు శ్రావణ మాస రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande