సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో బంగారు శాలువా
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 1 ఆగస్టు (హి.స.) చేనేత కళకు పెట్టింది పేరు సిరిసిల్ల. అలాంటి సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడి నుండి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో బంగారు శాల
సిరిసిల్ల చేనేత


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 1 ఆగస్టు (హి.స.)

చేనేత కళకు పెట్టింది పేరు సిరిసిల్ల. అలాంటి సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడి నుండి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో బంగారు శాలువాలు నేశాడు. దేశ త్రివిధ దళాల శక్తిసామర్థ్యాలు ఉట్టిపడేలా చేనేత మగ్గంపై కళా రూపంలో ఈ బంగారు శాలువాను తయారు చేశాడు. దీనిని అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా రూపొందించడం విశేషం. ఈ శాలువా 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో 2 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి నేశాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గం దాడికి ప్రతి చర్యగా త్రివిధ దళాలతో దాయాది దేశ ముష్కరులను హతమార్చి, ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాల సత్తా ఏంటో తెలియజేశారని, ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఈ బంగారు శాలువాను రూపొందించినట్లు నల్ల విజయ్ తెలిపాడు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా పంపిస్తానంటున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande