తెలంగాణ, పెద్దపల్లి. 1 ఆగస్టు (హి.స.)
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా కొరత లేకుండా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి తగు సూచనలు, సలహాలు చేశారు. యూరియాకు సంబంధించి మార్క్ఫెడ్ వారికి ఎప్పటిది అప్పుడు డ్యూస్ లేకుండా చూసుకొని సంబంధిత వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఇప్పటివరకు సంఘంలో 5500 బస్తాలు అమ్మకం జరగగా ఇంకా ఆగస్టు మాసంలో 4500 బస్తాలు అవసరమని సంఘ సీఈవో రమేష్, ఏవో నాగార్జున కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో అట్టి స్టాకు విడుతల వారీగా రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలన్నారు. రైతులు పాసుబుక్కులు తీసుకువచ్చి ఎకరానికి ఒక బస్తా చొప్పున తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు