ఏపీలో నో.ప్లాస్టిక్.బాటిల్స్
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) :ప్లాస్టిక్ అనేది మానవాళి జీవితంలో భాగమైందని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకున్నా జనాలు ప్లాస్టిక్ వాడటం మాత్రం మానడం లేదు. దానికి కారణం మన
ఏపీలో నో.ప్లాస్టిక్.బాటిల్స్


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

:ప్లాస్టిక్ అనేది మానవాళి జీవితంలో భాగమైందని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకున్నా జనాలు ప్లాస్టిక్ వాడటం మాత్రం మానడం లేదు. దానికి కారణం మనం ప్లాస్టిక్‌కు అలవాటు పడిపోవడమే. అయితే.. ఈ ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం తనదైన రీతిలో కొత్త కార్యచరణ మొదలుపెట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న తీరులో ప్లాస్టిక్ నిషేధాన్ని ఏపీ సచివాలయం నుంచి మొదలుపెట్టనుంది.d

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఆగస్ట్ 10 నుంచి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధాన్ని విధించింది. ఒక్కో స్టీల్ వాటర్ బాటిల్ సచివాలయంలోని ఉద్యోగులందరికీ ఇస్తామని ప్రకటించింది. అన్ని శాఖలకు రీ యూజబుల్ బాటిళ్లు అందిస్తామని తెలిపింది. సచివాలయానికి ఎవరు కూడా బయట నుంచి వాటర్ బాటిళ్లు తేకూడదని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande