భూ భారతి చట్టం రైతులకు ఒక వరం.. చట్టం రూపకర్త భూమి సునీల్
తెలంగాణ, ఖమ్మం. 1 ఆగస్టు (హి.స.) రాష్ట్ర రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పటిష్ఠమైన చట్టాన్ని తీసుకవచ్చిందని అదే '' భూ భారతి చట్టం'' అని ఇది రైతులకు ఒక వరంలాంటిదని భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ అన్నారు. శుక్రవారం ఖమ్మం
భూభారతి


తెలంగాణ, ఖమ్మం. 1 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పటిష్ఠమైన చట్టాన్ని తీసుకవచ్చిందని అదే ' భూ భారతి చట్టం' అని ఇది రైతులకు ఒక వరంలాంటిదని భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు రెవెన్యూ గ్రామంలో 'సాగు న్యాయ యాత్ర' లో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పొన్నేకల్లు రైతు వేదికలో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎమ్మార్వో రాంప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు దుక్కి దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మే దాకా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూమి, వ్యవసాయం, ఆహారానికి సంబంధించి రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు వచ్చాయన్నారు.

స్వాధీనంలో భూమి, చేతిలో పట్టాదారు పాసుపుస్తకం భూభారతిలో ఉంటేనే భూమి హక్కుకు భద్రత ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande