తెలంగాణ, సిద్దిపేట. 1 ఆగస్టు (హి.స.)
భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా
ఆయా గ్రామాల్లో స్వీకరించిన అప్లికేషన్లను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కొండపాక మండలం కేంద్రంలోని సమీకృత మండల కార్యాలయ సముదాయంని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవిన్యూ సదస్సుల పెండింగ్ అప్లికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంను సందర్శించి ఇందిరమ్మ ఇండ్లు 273 శాంక్షన్ లో ఉండగా 237 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని 100% గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కట్టుకోడానికి సుముఖంగా లేనివారికి నోటీస్ ఇచ్చి పేరు తొలగించి మరొక లబ్ధిదారులకు మంజూరు చెయ్యాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇల్లు వేగంగా పూర్తి అయ్యేలా రోజు పర్యవేక్షణ చెయ్యాలని ఎంపీడీవోని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు