అద్దం రాజధాని గుహవతిజ.లో.శ్రీవారి.ఆలయ నిర్మాణానికి టిటిడి చర్యలు చేపట్టింది
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) తిరుమల: అస్సాం రాజధాని గువాహటిలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చర్యలు చేపట్టింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. గువాహటిలో
అద్దం రాజధాని గుహవతిజ.లో.శ్రీవారి.ఆలయ నిర్మాణానికి టిటిడి చర్యలు చేపట్టింది


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

తిరుమల: అస్సాం రాజధాని గువాహటిలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చర్యలు చేపట్టింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎంతో తితిదే ఛైర్మన్‌ చర్చించారు. ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

దీనికి స్పందించిన సీఎం హిమంత.. ఐదు ఎకరాల స్థలంతోపాటు ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. తమ రాష్ట్ర రాజధానిలో తిరుమల శ్రీవారి అద్భుతమైన ఆలయం నిర్మించాలని తితిదే నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నట్లు సీఎం అన్నారు. తితిదే ఆధ్వర్యంలో నిర్మించబోయే శ్రీవారి ఆలయం ద్వారా హిందూధర్మ పరిరక్షణ, సంప్రదాయాలు, హిందుత్వ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande