నామినేటెడ్ పదవుల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి, 1 ఆగస్టు (హి.స.)కష్టపడి పని చేసిన టీడీపీ కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈరోజు(శుక్రవారం) పార్టీ ముఖ్య నేతలతో సీఎం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉ
నామినేటెడ్ పదవుల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)కష్టపడి పని చేసిన టీడీపీ కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈరోజు(శుక్రవారం) పార్టీ ముఖ్య నేతలతో సీఎం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై చర్చించారు. ఈ నెల(ఆగస్టు)లో అమలు చేయబోతున్న రెండు పథకాలపై నేతలకు వివరించారు.

ఈ రెండు కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రైతు భరోసా పేరుతో రైతును వైఎస్ జగన్ మోసం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రం ఇచ్చే దానితో కలిపి 20,000 రైతుకు చెల్లిస్తుంది అన్నారు. నామినేటెడ్ పదవులు కూడా త్వరలోనే విడుదల చేస్తున్నామని తెలిపారు. నాకు కార్యకర్తలే ముఖ్యం అన్నారు. కష్టపడి పని చేసిన వారికి త్వరలో పదవులు లభిస్తాయి అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande