అమరావతి, 1 ఆగస్టు (హి.స.)జగన్ (Jagan) నెల్లూరు పర్యటనలో భాగంగా పోలీసుల లాఠీచార్జిపై తాజాగా హోం మంత్రి అనిత (Home Minister Anitha) స్పందించారు. ఇవాళ సచివాలయంలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలను విడుదల చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని అన్నారు. త్వరలో కానిస్టేబుళ్ల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సైలెంట్‌గా ఉన్నప్పటికీ వైసీపీ (YCP) నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లు రాష్ట్రంలో ఎలాంటి అఘాయిత్యాలు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని కామెంట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి సవాళ్లను తీసుకునేందుకు తామిప్పుడు సిద్ధంగా లేమని.. ఆయన తమకు ముఖ్యం కాదని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. తమకు ఓట్లు వేసిన జనానికి చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ఏ పర్యటనకు వెళ్లినా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ఐదేళ్లు పాలించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితిని కల్పించారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు సమస్యలు సృష్టిస్తే.. పోలీసు అధికారులను జగన్ బెదిరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేదని హోం మంత్రి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి