టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
తిరుమల, 1 ఆగస్టు (హి.స.) టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్ర‌వారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండ
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం


తిరుమల, 1 ఆగస్టు (హి.స.)

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్ర‌వారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం తాలూకు డీడీని అందజేశారు.

కాగా, తిరుమలలో భక్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు ఉన్న భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల స‌మ‌యం ప‌డుతోంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక‌, నిన్న శ్రీవారిని 66,149 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు అని అధికారులు వెల్ల‌డించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande