సిద్దిపేట, 13 ఆగస్టు (హి.స.)
సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేద్దాం దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైస్కూల్ మైదానం వద్ద ర్యాలీని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం జెండా ఉపి ప్రారంభించారు. ఎంపీ రఘునందన్ రావు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఎబీవీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ పాత బస్టాండ్ వరకు సాగింది.
ర్యాలీలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... జాతీయ భావన పెంపే లక్ష్యంగా పల్లెలు, పట్టణాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నేను ఇండియన్ అని చెప్పుకునే విధంగా యువత, విద్యార్థులను జాగృతం చేయడం తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పంద్రాగస్టు రోజున ప్రతి ఒక్కరు వారి ఇంటి మీద జాతీయ జెండాలను ఎగరవేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి అమర వీరుల త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళా ఉద్యోగులు ముష్కరు స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించారని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్